ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ప్రజల నమ్మకాన్ని పొందగలిగితేనే పాలకొండ నియోజకవర్గ పరిధిలో పరిశ్రమల స్థాపన అభివృద్ధి సాధ్యమౌతుంది

పాలకొండ రెవెన్యూ డివిజన్ శ్రీకాకుళం జిల్లాలో ఒక పరిపాలక విభాగం. పాలకొండ మున్సిపాలిటీ, మండల కేంద్రం మరియు శాసనసభ నియోజకవర్గంగా వ్యవహరిస్తున్నది. పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ , సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు ఉన్నాయి . నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. 2018 నాటికి 2,47,087 మంది జనాభా ఉన్న ఈ మండలంలో 1,64,478 ఓటర్లున్నారు. మొత్తం మండలం అక్షరాస్యత 58 శాతం మాత్రమే. జనాభాలో 20 శాతం మంది షెడ్యూల్ కులాలకు, తెగలకు చెందినవారు కాగా, 72 శాతం పట్టణ ప్రాంతంలోనూ, 28 శాతం గ్రామీణ ప్రాంతంలోనూ నివసిస్తున్నారు.

72 శాతం పైగా పట్టణ ప్రజలున్న పాలకొండ పట్టణంలో 54 శాతం మంది నిరుద్యోగులున్నారు. ప్రధానంగా వ్యవసాయంపైన ఆధారపడి జీవించే షెడ్యూల్ తెగలు, పల్లెలు జీడీ, పైనాపిల్, అల్లం, పసుపు వంటి వాణిజ్య పంటలను అధికంగా పండిస్తారు. ఏటా 10 కోట్లకు పైగా వాణిజ్య ఉత్పత్తులనందించే ఈ మండలంలో ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసి దేశానికి విశేషంగా విదీశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది. నాగావళి నది మండలంలోనే ఉన్న సాగు, తాగు నీరందక ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయ ఎడమకాలువ పనులు, జంపరకొండ రిజర్వాయర్, భామిని మండలంలో కొండలోయగెడ్డ రిజర్వాయర్, వీరఘట్టం రోడ్డు వెడల్పు కార్యక్రమం , పాలకొండ పట్టణానికి మౌలిక వసతులు అందించే మాస్టర్ ప్లాన్, గిరిజనగ్రామాలకు ఉద్దేశించిన రహదారి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పూర్తికాలేదు. వీరఘట్టంలో సరియైన భవనాలు లేక డిగ్రీ కళాశాల తరగతులను పంచాయితీ భవనాలలో నడుపుతున్నారు. 500కు పైగా విద్యార్థులున్న కళాశాలకు ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. శిదిలమైన భవనాలలో కళాశాలలు నడపడం వల్ల భద్రతలోపిస్తున్నది. దీని వల్ల ప్రభుత్వ కళాశాల ప్రజల ఆదరణ కోల్పోతున్నది. ప్రభుత్వ వైద్యశాలలలో కనీసవసతులు లేకపోగా, అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతోబాటు, సిబ్బంది అవినీతి పేదప్రజలను నిలువునా దోచుకుంటున్నది. మండలంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, సాగు, తాగు నీళ్లు పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే, పట్టణ ప్రాంతాలు విద్యా, వైద్య సేవలు అందక సతమతమవుతున్నాయి. నిరుద్యోగం అధికంగా ఉంది, సరైన ఉఫాధి అవకాశాలు లేక ఈ ప్రాంతంలో వలసలు అధికమే. కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోయినా మూతపడ్డ చెరకు సహకార ఫ్యాక్టరీ, జ్యూట్ మిల్లులు, తెరవడంతో బాటు, జీడీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చు. అపారమైన క్వార్జ్, గ్రానైట్ వంటి ఖనిజ నిక్షేపాలున్న ఈ మండలంలో ప్రజలను ఒప్పించి, పర్యావరణహితమైన పద్దతులలో పరిశ్రమలు స్థాపిస్తే, ప్రజల నమ్మకాన్ని పొందవచ్చు.

పాలకొండ నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి