మండల ముఖ్యకేంద్రం మందస. మందస చారిత్రక పట్టణం. ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం, రాజా వారి కోట, ప్రక్కనే ఉన్న చిట్టడవి, అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి. మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే పాండవులు చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల వాసుదేవ ఆలయంలో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.
మందస, శ్రీకాకుళం జిల్లా, మందస మండల కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం, ఈ మండలం 20596 ఇళ్లతో, 82699 జనాభాతో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 40252, ఆడవారి సంఖ్య 42447. ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష. మంజూష మంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్థం. అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామల మైన ఈ ప్రాంతం 800 ఏళ్ళ నుండి మందస సంస్థానానికి ముఖ్య పట్టణం. ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నాయి. గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం, జగన్నాధస్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, చండేశ్వరాలయం, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.ప్రసిద్ధ మహేంద్ర గిరి యాత్ర ప్రతి శివరాత్రికి ఇక్కడినుంచే ప్రారంభం అవుతుంది