ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పలాస మండలం

పలాస శ్రీకాకుళం జిల్లాలోని ఒక మండలం. ఈ నగరం, జిల్లా ప్రధానకార్యాలయం శ్రీకాకుళం నుండి ఉత్తర దిక్కున 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణాన వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలు, తూర్పు వైపు మందస మండలం, పశ్చిమానికి పర్లాకిమిడి మండలం పలాసకు సరిహద్దులలో ఉన్నాయి. పలాసలో 102 గ్రామాలు, 20 పంచాయితీలు ఉన్నాయి. పలాస మండలంలో ఉన్న గ్రామాలలో కంబ్రిగం చిన్న గ్రామం మరియు బ్రాహ్మణతర్లా అతిపెద్ద గ్రామం.

ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామము. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్టణం వాతావరణము నెలకొని ఉంటుంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని 1996 నవంబరు 22న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21 వార్డులుండేవి. ఇప్పుడు 25 వార్డులు అయ్యాయి.

జనాభా

పలాస మండల మొత్తం జనాభా మొత్తం 87,850, ఇందులో 20,008 ఇళ్ళు, మొత్తం 102 గ్రామాలు మరియు 20 పంచాయితీలు విస్తరించాయి. పురుషులు 42,978 మంది, 44,872 మంది మహిళలు పట్టణంలో నివసిస్తున్నారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో 37,951 మంది నివసిస్తున్నారు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపములోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయము, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ

ఉత్తర తీరప్రాంత జిల్లాలలోని పలసాలో 350 కిలోల జీడి పరిశ్రమలు ఉన్నాయి.ఈ (పలాస-కాశీబుగ్గ) జంట నగరాలు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద జీడిపని ఉత్పత్తి కేంద్రాలు మరియు భారతదేశంలో అతిపెద్ద ప్రాసెసింగ్ కేంద్రాలు. జీడి పరిశ్రమ చుట్టుప్రక్కల ప్రాంతాలలో సుమారు 15,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్షగా ఉపాధి కల్పిస్తుంది.

ప్రసిద్ధ ప్రదేశాలు

పలాస రైల్వే స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో రట్టి, అకుపల్లి, మెట్టూరు మరియు తోతురు (హనుమాన్ సాగర్) బీచ్లు ఉన్నాయి.

సమస్యలు

  • జీడీ పిక్కల పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలి
  • జీడీ పిక్కల బోర్డు ఏర్పాటు చేయాలి
  • నిరుద్యోగులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి
  • బస్ స్టేషన్ ఆధునీకరించాలి
  • ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
  • క్రీడా మైదానం సమకూర్చాలి
  • రాజధాని అమరావతికి వెళ్లేందుకు అనువైన రైలు సౌకర్యం కల్పించాలి
  • సూపర్ ఫాస్ట్ రైళ్లు పలాసలో నిలపాలి
  • భూ దంధాలు నిలిపివేయాలి స్థానికంగా ఉపాధి కల్పించి వలసలను అరికట్టాలి

 

 

పలాస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి