పాతపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక మండలకేంద్రము మరియు ఒక శాసనసభా-నియోజక వర్గము. ఇది సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. మహేంద్రతనయ నదికి దగ్గరగా ఉండి, చుట్టూ పచ్చని అడవులు, కొండలతో కూడుకొని యున్నది. ఇక్కడ ఒక హాస్పిటల్, పోస్టాపీసు, అర్.టి.సి.బస్ స్టాండ్, జూనియర్ సబ్ జడ్జి కోర్టు ఉన్నాయి. నౌపొడా - గుణుపూర్ రైల్వే లైనుకి కలుపబడి ఉంది. వ్యవసాయమే ముఖ్య వృత్తి. ఇక్కడి నీలమణి దుర్గా అమ్మవారు గుడి చాలా ప్రఖ్యాతమైనది. ఈ దేవతను భక్తులు శక్తిగల తల్లిగా భావించి కొలుస్తారు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం 16074 ఇళ్లతో, 64639 జనాభాతో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 31896, ఆడవారి సంఖ్య 32743. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 8133 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 9376.
గజపతి ప్యాలెస్, జగన్నాథ ఆలయం కాంప్లెక్స్, రామ్ సాగర్ మరియు సీత సాగర్ ఈ ప్రాంతంలోనే పెద్ద నీటి రిజర్వార్లు, బి.యెన్ ప్యాలెస్ మరియు మహేంద్రతనయ నది, యస్.కే. సి.జి కళాశాల, మహారాజా బాయ్స్(బాలుర) హై స్కూల్ మరియు మహారాజా గర్ల్స్(బాలికల) హై స్కూల్ , చిత్రకూర్ స్ట్రీట్, చిత్రవర్కర్ కుటుంబం మరియు 500 సంవత్సరాల చిత్రకళ మరియు సాంప్రదాయ కళలకు ప్రసిద్ధి, ప్యాలెస్ వీధి, హార్న్-క్రాఫ్ట్, గోపాల కృష్ణా పతగార్ (లైబ్రరీ), భాయ్ సాహి హిల్.