ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జీవనాధారమైన వంశధారా నది రెండొదశ పూర్తయితేనే పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు జీవితంపై భరోసా కలుగుతుంది

శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండల కేంద్రం మరియు శాసనసభా నియోజకవర్గం కూడా. 2011 జనభా లెక్కల ప్రకారం పాతపట్నం మండలంలో జనాభా 64,639. అందులో 31,896 మంది పురుషులు మరియు 32,743 మంది మహిళలు ఉన్నారు. పాతపట్నం మండలం అక్షరాస్యత 55.97%, అందులో 64.61% పురుషులు 47.55% స్త్రీలు అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 50% జనాభా పట్టణ ప్రాంతంలో మరియు 50% మంది గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు.

పాతపట్నం, లక్ష్మీనర్సంపేట , వెళియాపుట్టి, కొత్తూరు, మరియు హీరా మండలాలు పాతపట్నం శాసనసభా నియోజకవర్గంలో అంతర్భాగం. ఎక్కువగా గిరిజన గ్రామాలున్న ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొదవలేదు. నాగావళి, వంశధారా నదులు ఇక్కడే ప్రవహిస్తున్నా, ఈ ప్రాంతపు రైతులకు ఒక చుక్క సాగునీరు కూడా రాదు. కారణం జూన్ నెలలో పూర్తి కావలసిన వంశధారా రెండొదశ పనులు ఆలస్యమౌతున్నది. దీనికొరకు భూములిఛ్చిన రైతులకు, నిర్వాసితులకు మంజూరైన పరిహారం, మధ్యవర్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై తినగా, మిగిలినది మాత్రం వీరికి చేరింది. ఫలితంగా, జీవనోపాధిని పోగొట్టుకున్న రైతులు వలసపోతున్నారు. గిరిజన గ్రామాలలో తాగునీరు ప్రధాన సమస్య. వర్షాకాలంలో కొండలపైన కురిసే నీటికోసం, వేసవిలో నీళ్లు నిలువనున్న చెలమలకోసం కిలోమీటర్ల దూరం మహిళలు, పిల్లలు కాలినడకనే వెళ్ళవలసి వస్తుంది. వంశధారా నదికి సరైన కరకట్ట లేకపోవడంతో, ఒరిస్సా రాష్ట్రం లేదా శ్రీకాకుళం జిల్లా వర్షాలకు నదులు ఉప్పొంగి, గ్రామాల్లో ఇండ్లను ముంచేస్తాయి. నదీపరివాహక ప్రాంతం పొడవునా కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి. పాతపట్నంలో భూగర్భ డ్రైనేజీతోబాటు, గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, వైద్య సదుపాయాలూ, విద్య, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించడంతో బాటు, వంశధార రెండొదశను వేగంగా పూర్తి చేయడంతోబాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించి తగినన్ని ఉఫాధి వనరులు కల్పించకుంటే వీరికి మనుగడే ప్రశ్నార్థకమౌతుంది.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి