శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.
జనాభా వివరాలు
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 125,939. ఇందులో 62,546 మగవారు మరియు 63,393 ఆడవారు ఉన్నారు. 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.
పౌర పరిపాలనన
శ్రీకాకుళం పురపాలక సంఘము 1856 లో స్థాపించారు. సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి ఇప్పటివరకు (13-12-2007) క్రమముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము 1 లక్షా 17 వేల జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది.
న్యాయము
జిల్లాలో ఉన్న మొత్తము 19 న్యాయస్థానాలలో ఇక్కడ 1.జిల్లాకోర్టు, 2.మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పట్నంలో సుమారు 75 వరకు న్యాయవాదులున్నారు. రాజకీయంలో ఉన్న ప్రముఖులంతా సుమారు న్యాయవాదులే. పట్నంలో ఒక న్యాయ కళాశాల ఉంది.
వైద్యము
- జిల్లాకేంద్ర ఆసుపత్రి 400 పడకలతో అతిపెద్ద హాస్పిటల్
- జిల్లాకి ఒక మెడికల్ కాలేజి ఉంది.
- జిల్లాలో గల ఒక దంతవైద్యకళాశాల శాపారములోనే ఉన్నది
- పట్నంలో ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి.
- పట్నంలో 5 ఆరోగ్య శిబిరాలు 1 పురపాలకసంఘం,4 స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలోను నిర్వహించబడుతున్నాయి.
- అనేక ప్రైవేటు నర్సింగ్ హోం లు,స్పెసలిస్టు డాక్టర్లు ఉన్నారు.
సమస్యలు
- జిల్లా కేంద్రం మౌలిక సదుపాయాలు, కనీస సదుపాయాలకు వృద్ధి చేయాలి
- జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, శాలిహుండం ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రాలను పర్యాటకంగా వృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలి
- పట్టణంలో తాగు నీటికి కటకట
- ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
- జిల్లాలో నదుల నీళ్లు పూర్తి స్థాయిలో వినియోగానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
- అండమాన్ లో తెలుగు వారిపై ధృష్టి పెట్టాలి
- రహదారులకు మోక్ష్యం కలిగించాలి
- మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
- బీసీ స్టడీ సిర్కిల్ కు శాశ్వత భవనం నిర్మించాలి
- వివిధ దశల్లో ఉన్న పనులు సత్వరం పూర్తి చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించాలి
- రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
- కనుమరుగవుతున్న సముద్ర తీరాన్ని కాపాడాలి
- శ్రీకాకుళం సహా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ప్రజలను దోమల బెడదల నుంచి కాపాడాలి కాలుష్య కారక పరిశ్రమలపై నిషేధం విధించాలి
- వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఆధారిత పరిశ్రమలు ప్రోత్సహించాలి