టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నుండి 50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభకి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇది ఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము.
పేరు వెనక చరిత్ర
టెక్కలి ప్రాంతం 1816 నుండి 1832 వరకు పర్లాకిమిడిరాజు గణపతి పద్మనాభదేవ్ పాలనలో వుండేది. అతని కుమారులు ఆ రాజ్యాన్ని రెండుగా విభజించి టెక్కలిని గోవిందనాథ్ దేవ్, నందిగాం ను కృష్ణ చంద్రదేవ్ లు పాలించారు. టెక్కలి పాలకుడు గోవింద నాథ్ దేవ్ తన కుమార్తెకు వివాహము జరిపించినప్పుడు పసుపు,కుంకుమల క్రింద టెక్కలి గ్రామాన్ని దారా దత్తం చేశాడు. టిక్లి అనగా ఒడియాలో పసుపు,కుంకుమల బుట్ట అని అర్థం అలా ఆ గ్రామాన్ని టిక్లి అని పిలిచేవారు. కాల క్రమంలో అది టెక్కలిగా రూపాంతరం పొందింది.
2011 జనాభా లెక్కల ప్రకారం టెక్కిలీ మొత్తం జనాభా 28631. వారిలో పురుషులు 13934 మరియు స్త్రీలు 5699,14697 ఇళ్లలో నివసిస్తున్నారు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 2931
ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం, ప్రభుత్వ-సహాయం మరియు ప్రైవేటు పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ కింద ప్రారంభించాయి .బోధన మాధ్యమం తరువాత వివిధ పాఠశాలలు ఇంగ్లీష్ మరియు తెలుగు.
ప్రముఖులు