అరకు వాలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లో ఒక లోయ ప్రాంతం. కొండలు మరియు పచ్చదనంతో మంత్రముగ్ధమైన అందంతో అరకు ప్రసిద్ధమైంది. ఈ ప్రదేశం కాఫీ తోటలకు ప్రసిద్ధి, అరకు లోయ కాఫీ హౌస్ వద్ద వాటిని మనం రుచి చూడవచ్చు.
“ సౌత్ ఇండియా ఫుడ్ బౌల్ ”గా ఈ ప్రదేశం పేరొందింది. అరకు వాలీ, వైజాగ్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం తరచుగా ఆంధ్ర ఊటీ గా పిలువబడుతుంది.
అరకు వాలీలోని అత్యుత్తమ పర్యాటక ఆకర్షణలు
- శ్రీ మహలింగేశ్వర స్వామి ఆలయం
- కాఫీ తోటల పెంపకం
- అరకు ట్రైబల్ మ్యూజియం
- కటికి జలపాతాలు
- బొర్రా గుహలు
- చాప రాయి
- గాలికొండలు వీక్షణ స్థలం
- టైడా క్యాంప్
- పద్మపురం బొటానికల్ గార్డెన్స్
ఈ పట్టణ సమస్యలు
- పద్మావతి గార్డెన్, మ్యూజియం ఆధునీకరించాలి
- మండల కేంద్రానికి ఆరు కి.మీ. దూరంలో ఉన్న రణజిల్లేడు జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
- 1954లో నెలకొల్పిన కొత్తవలస హర్టికల్చర్ విభాగానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి
- లక్కబొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలి
- పర్యాటక కేంద్రాలకు కొత్త శోభను తీసుకురావాలి
- రక్షిత మంచినీటి పధకాలు ఉన్నా నీటి ఎద్దటి తప్పడం లేదు
- మన్యంలో రహదారుల సదుపాయం అంతంత మాత్రమే వుంది వాటిని అభివృద్ధి చేయాలి.
- చెక్ డ్యామ్ లకు మరమ్మతులు చేస్తే సాగు నీరు అందుతుంది
- చుంపి గ్రామంలో ఊట నీటిని శుద్ధి చేస్తే తాగు నీటి సమస్య కొంత తీరుతుంది
- మారుమూల సీ.సీ రోడ్లు అవసరం