విశాఖపట్టణం జిల్లాలో ఉన్న 46 మండలాలలో విశాఖపట్టణం గ్రామీణ మండలం ఒకటి. భీమునిపట్నం, ఆనందపురం మరియు సీతమ్మదర మండలాలచే సరిహద్దుగా ఉంది.
విశాఖపట్నం జిల్లా రూరల్ ప్రాంతంలో 22.5 లక్షల జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 వ కనీస గ్రామీణ జనాభా కలిగిన జిల్లా.
విశాఖపట్నం జిల్లా గ్రామీణ భాగంగా 11 వేల కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది మరియు ప్రాంత విస్తీర్ణతతో పోలిస్తే విశాఖపట్టణం 6 వ అతిచిన్న గ్రామీణ జిల్లా. విశాఖపట్టణం జిల్లాలో 39 ఉప జిల్లాలు ఉన్నాయి, వాటిలో అనకాపల్లి 95 వేల మంది గ్రామీణ జనాభా కలిగిన అత్యంత ఉప జిల్లాగా ఉంది మరియు పెందుర్తి 32 వేల మంది గ్రామీణ జనాభాతో ఉంది.
జనాభా
జిల్లాలో సుమారు 22.5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు, వీరిలో 11.1 లక్షలు (49%) పురుషులు మరియు 11.4 లక్షల (51%) మంది స్త్రీలు.
అక్షరాస్యత
మొత్తం జిల్లాలో 10.7 లక్షల మంది ప్రజలు అక్షరాస్యులు. వీరిలో 6.2 లక్షల మంది పురుషులు, 4.5 లక్షల మంది మహిళలే. పురుషులు 63% మరియు స్త్రీలలో 45% ఇక్కడ అక్షరాస్యులు ఉన్నారు. జిల్లాలో మొత్తం అక్షరాస్యత రేటు 6% పెరిగింది. పురుషుల అక్షరాస్యత 4% పెరిగింది మరియు మహిళల అక్షరాస్యత రేటు 9% పెరిగింది.
ఈ పట్టణ సమస్యలు:
- పోర్టు కాలుష్యం నుంచి మహా నగర ప్రజలను కాపాడాలి
- పాత నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలి
- వ్యాపారుల మనోభావాలను దెబ్బతీస్తూ జగదాంబ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు చేపట్టిన రహదారి విస్తరణపై పెద్ద ఎత్తున ఆందోళన. ఈ సేవలను విరుద్ధంగా అందరికీ మేలు జరిగే విదంగా చర్యలు తీసుకోవాలి.
- ఇందిరా ప్రియదర్శిని స్టేడియమ్ కు నాటి కళను తీసుకురావాలి.
- ఇసుక కుండ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి రోడ్డు వేయాలి
- టౌన్ కొత్త రోడ్డులో గల సూయజ్ ఫామ్ తొలగించాలి
- స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిలకపేట లో కంటైనర్ యార్డు నుంచి రక్షణ కల్పించాలి
- కబ్జాదారుల నుంచి సుమారు వెయ్యి ఎకరాల ఆంధ్ర విశ్వ విద్యాలయం భూములను పరిరక్షించాలి
- ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు స్థలం కేటాయించాలి
- వివాదాన్ని పరిష్కరించి జిల్లా గ్రంథాలయ భవనాన్ని వెంటనే నిర్మించాలి
- స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసిన సెస్ ను గ్రంధాలయాలకు విడుదల చేయాలి
- ప్రయాణీకులకు విస్తృత సేవలు అందిస్తున్న విశాఖ విమానాశ్రయాన్ని వేరే చోటకు తరలించరాదు
- అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్టేషన్ను అభివృద్ధి చేయాలి
- అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డుకు అడ్డుగా ఉన్న చిన్నూరు సమస్యకు పరిష్కారం చూపించాలి
- ఆరిలోవలో జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి
- నగరంలోని మారుమూల వాడల్లో తాగునీటి సమస్యను తీర్చాలి
- ఎన్ఏడి జంక్షన్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని యుద్ధప్రాతిపదికన నిర్మించాలి
- గోపాలపట్నంలోని 14 గ్రామాల ప్రజల అవసరాలు తీర్చే కొత్తపాలెం అండర్ పాత్ వే అభివృద్ధి చేయాలి
- సింహాచలం పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలి
- పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలి
- నగరంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి
- ముందుగా ప్రకటించినట్టుగా విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎన్ విరాట్ విక్రమాధిత్యను విశాఖపట్టణానికే తిరిగి కేటాయించాలి. విక్రమాధిత్యను మ్యూజియంగా రూపొందించేందుకు విశాఖయేనే అనువైన ప్రదేశం
- ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ను ఎట్టి పరిస్థితిలోనూ తరలించడానికి వీలులేదు
- ప్యాకేజీ విడుదల చేయాలి
- రాష్ట్ర పునర్వీభజన సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీని తక్షణం విడుదల చేయాలి. ఈ మొత్తాన్ని ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడే రంగాలకే ఖర్చు చేయాలి. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపించే విధంగా ఉండాలి. వలసలు నిరోధించే విధంగా ఈ ప్యాకేజీ మొత్తం ఉపయోగపడాలి
- ఉత్తరాంధ్రలో నదులకు కొదవలేదు. ఆ నదుల నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది. వంశధార, జంఝావతి నదులపై కట్టిన ఆనకట్టలను ఒడిశా సర్కార్ అడ్డుకుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. అతి స్వల్ప వివాదాన్ని ఒడిషా కాలయాపన చేస్తోంది. దీని వల్ల ఉత్తరాంధ్రకు తీరని నష్టం జరుగుతోంది. కేంద్రం జోక్యం చేసుకుని ఈ వివాదాలకు ముగింపు పలకాలి.
- త్రాగు నీరు, సాగు నీరే కాదు పరిశ్రమలకు కావలసిన నీటి విషయంలో కూడా ఆంధ్ర తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటోంది. విశాఖ నగరంలో ఉన్న భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన నీటిని ప్రభుత్వం అందివ్వలేకపోతోంది. దీనివల్ల పూర్తిస్థాయిలో ఆయా పరిశ్రమలు ఉత్పత్తిని అందించలేకపోతున్నాయి. ఉత్తరాంధ్ర నీటి కష్టాలను తీర్చేందుకు గతంలో ప్రకటించి తరువాత రద్దు చేసిన బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి లేదా తత్సమాన ప్రాజెక్టును మంజూరు చేయాలి. పోలవరం జలాలను తీసుకు రావడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
- ఓడరేవులు
- ఉత్తరాంధ్రకు మంజూరైన ఓడరేవులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. భావనపాడు కళింగపట్నం, భీమునిపట్నం ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం చర్యలు తీసుకోవాలి. తూర్పు తీరానికి ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చిన భీమునిపట్నం ఓడ రేవుకు పూర్వ వైభవం తీసుకు రావాలి. గతంలో సేవలందించిన కళింగపట్నం ఓడ రేవును వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్తరాంధ్రకు మరింత మేలు కలుగుతుంది. రేవులతోపాటు మత్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ లు కూడా కట్టించాలి. మత్స్యపరిశ్రమ పై కేవలం సంప్రదాయ మత్స్యకారులే కాకుండా వేలాది మంది ఇతర కులాల వాళ్ళు జీవిస్తున్నారు.
- ఎర్ర బస్సు లేనిచోట ఎయిర్ బస్
- ఇది చాలా విడ్డూరమైనది. భోగాపురం మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం విజయనగరానికి, విశాఖ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఇక్కడ ప్రజలు ప్రైవేటు ట్రాన్స్ పోర్టు మీదే ఆధారపడ్డారు. సముద్ర తీరంలో ఉన్న భోగాపురానికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని ప్రజలు వద్దని మొర పెట్టుకుంటున్నా ఇక్కడ విమానాశ్రయాన్ని నిర్మించి పంతం నెగ్గించుకొనే పనిలో సర్కార్ ఉంది. ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు మంజురైనందుకు సంతోషించాలో, ప్రజల పొట్ట కొడుతున్నందుకు చింతించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందిన విశాఖ ఎయిర్ పోర్టును భవిష్యత్ లో నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. స్మార్ట్ సిటీ విశాఖ నగరం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ పోర్టును సరుకు రవాణాకు మళ్ళించి భోగాపురం లో ప్రయాణికుల విమానాశ్రయాన్ని నిర్మించేందుకు సర్కార్ యత్నిస్తోంది. తమకు ఎయిర్ పోర్టు వద్దంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది.
- విశ్వవిద్యాలయాలు
- నవ్యాంధ్ర లో విశ్వవిద్యాలయం లేని జిల్లా ఏదైనా ఉందంటే అది విజయనగరమే. సరస్వతీ నిలయమైన విజయనగరం ఎందుకనో నేటి పాలకుల దృష్టిలో పడలేదు. వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు, హరికథ పితామహుడు, ఆదిభట్ల నారాయణదాసు, గానకోకిల పి.సుశీల సహా ఎంతో మంది సంగీత ప్రముఖులను అందించిన విజయనగరం జిల్లాలో విశ్వ విద్యాలయం నెలకొల్పేందుకు తెలుగుదేశం సర్కార్ ముందుకు రాకపోవడం విచారకరం. ఉత్తరాంధ్ర జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ప్రకటించిన ప్రభుత్వం ఒత్తిళ్లు కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. విజయనగరం జిల్లా పాచిపెంటలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు అవసరమైన సర్వే నిర్వహించింది. విజయనగరం రాజవంశీకులు మాన్సాస్ ట్రస్ట్ నుంచి సుమారు మూడు వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అన్నీ అనుకూలంగా ఉన్న ఆచార్యులు అవస్థలు పడతారనే సాకుతో పాచిపెంటను పక్కకు పెట్టేసింది. పాచిపెంట నుంచి అరకు కేవలం 60 కిలోమీటర్లే, అంతేకాదు ఒడిషా, చత్తీస్గడ్ రాష్ట్రాలు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడ విశ్వ విద్యాలయం నెలకొల్పడం వల్ల ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, పొరుగు రాష్ట్రాల గిరిజన విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది.
విశాఖపట్నం మండలంలోని గ్రామాలు
- కొమ్మాది
- పరదేశిపాలెం
- బక్కన్నపాలెం
- గోపాలపట్నం (గ్రామీణ)
- పోతిన మల్లయ్య పాలెం