ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

బుచ్చెయ్యపేట మండలం

బుచ్చయ్యపేట విశాఖపట్నం జిల్లాలో ఒక మండలం. బుచ్చయ్యపేట లో సందర్శించడానికి అనేక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం లోని వాతావరణం మరియు ఉష్ణోగ్రత పర్యాటకులకు ఉత్తమమైనది. ఈ మండలంలో 38 గ్రామాలు ఉన్నాయి. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం 66,214 మంది జనాభాతో విస్తరించి ఉంది. మండలంలో మగవారి సంఖ్య 32,896, ఆడవారి సంఖ్య 33,318. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 42.75% ఇందులో పురుషులు 54.04% మంది మరియు స్త్రీలు 31.85%.

ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం నుండి పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుచ్చయ్యపేటలో 58 గ్రామాలు, 32 పంచాయితీలు ఉన్నాయి.

బుచ్చయ్యపేట సమీపంలోని పర్యాటక ప్రదేశాలు

  • శ్రీ దుర్గాదేవి ఆలయం
  • బొజ్జన్నకొండ
  • లింగాల తిరుగుడు

బుచ్చయ్యపేట సమీపంలో 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో రైల్వే స్టేషన్ లేదు. ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి రైల్వే స్టేషన్ ఉంది.విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి, సింహచలం, మర్రిపాలెం మరియు కొత్తవలస రైల్వే స్టేషన్ల నుండి ఇక్కడకు చేరుకోవచ్చు.

ఈ పట్టణ సమస్యలు

  • కస్పాలో మొక్కైనా ఉండాలి .. కాశీలో చావైనా ఉండాలి అనేది ఇక్కడి నానుడి. ఒకనాటి ఈ నానుడికి నేడు తెరపడింది. కస్పాలో మొక్క మొలవడం మానేసింది
  • వడ్డాదిని మండలం కేంద్రం చేయాలి.
  • బస్సు సౌకర్యం లేదు
  • మాడుగుల వద్ద పెద్దేరు పై జాలంపల్లి జలాశయం నుంచి నీరు వచ్చేది, ఇప్పుడు లేదు కస్పాకు నీటి హక్కు వడ్డాదికి ఉందా? లేదా? అని స్థానికుల సందేహం
  • జాలంపల్లి వద్ద డ్యామ్ కట్టాలి
  • పెద్దేరు నదిపై వడ్డాది వద్ద వంతెన కూలే దిశలో ఉంది కొత్త వంతెన నిర్మించాలి
  • వడ్డాది, బుచ్చయ్యపేట మధ్య రహదారి విస్తరించాలి
  • డిగ్రీ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ కావలి
  • రైతుకు గిట్టుబాటు ధర లేదు
  • ఉపాధి కూలి పనులకు రైతులకు అనుసంధానం చేయాలి
  • ఎన్టీఆర్ జలసరిలో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు రైతులకు కనీసం అయిదు ఎకరాల భూమి ఉంటె ప్రభుత్వం ఉచితంగా బోరు వేస్తుంది. ఈ పధకాన్ని ఎక్కువ మంది లబ్ది చేకూరేలా ప్రభుత్వం కృషి చేయాలి
  • కనుమరుగవుతున్న ఎర్రవాయిని కాపాడాలి
చోడవరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి