ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చోడవరం మండలం

ఈ గ్రామం పేరు "చోళవరం". చోళ రాజవంశం (300BC నుండి 1279AD) కాలంలో, ఒరిస్సా యొక్క "గజపతి రాజ్యం" లోకి ప్రవేశించడానికి వారి సరిహద్దు పదంగా "చోళ వరం" కలిగి ఉంది., సమయం గడిచేకొద్దీ; పేరు "చోడవరం" కు మార్చబడింది.

విశేషాలు

చోడవరంలో శివాలయం చూడచక్కని ప్రదేశం. పక్కన ఉన్న కొలను కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుని గుడి ప్రసిద్దమైనది. అక్కడ భక్తితో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం. వినాయకుని తొండం భూగర్భంలో చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. మరియు ఆ తొండం క్రమెపి పెరుగుతు ఉంది. అక్కడున్న మార్కంరేవు మంచి విహారయాత్రా ప్రాంతం. వెంకన్నపాలెం గ్రామంలో సాయిబాబా గుడి ప్రసిద్దమైనది. ఈ గ్రామం ప్రధాన పంచాయితి, చుట్టుపక్కల కొన్ని మండలాలకి వాణిజ్య కేంద్రంగా ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఇది 3వ పెద్ద పట్టణంగా వెలుగొందుతుంది. త్వరలో ప్రభుత్వం కొత్తగా ఎర్పాటు చేసే మునిసిపాలిటీల్లో చోడవరం పేరును కూడా పరిగణించడం జరిగింది.

విద్యాసంస్థలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ఇతర కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ కళాశాల(GDC) అని పిలువబడే ఉన్నత అధ్యయన ప్రభుత్వ సంస్థ ఉంది, ఈ సంస్థ B.Sc ఫిజిక్స్/కెమిస్ట్రీ స్టడీస్ కి ప్రసిద్ధి చెందింది. చోడవరంలో వినాయకుడి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది మరియు ఇది 'స్వయంభూ వినాయకా' గా పిలువబడుతుంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యాపార మరియు ఆహార పంటల పెంపకం. చోడవరం నియోజకవర్గంలో 1,54,712 నమోదైన ఓటర్లు ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణ జనాభా సంఖ్య 20,251, అందులో 9,868 మంది పురుషులు మరియు 10,383 మంది స్త్రీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే ఈ పట్టణంలో పిల్లల జనాభా నిష్పత్తి 951 గా ఉంది. చోడవరం పట్టణ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ 77.49%.

ఈ పట్టణ సమస్యలు

  • తుని, నర్సీపట్నం, చోడవరం, మూడుగుల, చీడికాడా, కొత్తవలస వరకు కొత్త రైల్వే లైన్ వేయాలి. 30 ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి ప్రతిపాదనల్లో నేటికి పురోగతి లేదు. రోడ్ల విస్తరణ కార్యక్రమం పెండింగ్ లో ఉంది.
  • స్థానిక ఆసుపత్రి 50 పడకల స్థాయికి పెంచాలి.
  • తాగునీటి సమస్య తీర్చేందుకు పెద్దేరు, గౌరీపట్నం నుంచి రక్షిత మంచినీటి పథకం రూ. 1.5 కోట్లతో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు శoకుస్తాపన చేసారు. ఇది తొమ్మిది నెలలుగా నత్త నడక నడుస్తుంది.
  • మండలంలో శారద, పెద్దేరు, బొడ్డేరు నదులు ఉన్నాయి. ముద్దుర్తి వద్ద త్రివేణి సంగం. ఇసుక తవ్వకాల వల్ల నీరు లేకుండా పోయింది. గోయన్లు బాగుచేయించాలి. పెద్ద చెరువుపై లక్ష్మీపురం వద్ద మినీ రిజర్వాయర్ ప్రతిపాదన 1995 నుంచి పెండింగ్ లో ఉంది. ఈ కారణంగా నీరు వృదాగా శారద నదిలో కలుస్తుంది.
చోడవరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి