మాడుగుల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. మాడుగుల హల్వా చాలా ప్రసిద్ధి.
ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 72,006 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 35,220, ఆడవారి సంఖ్య 36,786. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 44.81% ఇందులో పురుషులు 56.24% మంది మరియు స్త్రీలు 33.76%.
విద్యుత్తు
మండలంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ప్రధాన పంటలు
వరి, చెరకు, రాగులు
చేతివృత్తులవారి ఉత్పత్తులు
కుండలు, చెక్క వస్తువులు
ఈ పట్టణ సమస్యలు
- మండలం లో ఉన్న పెద్దేరు ఎడమ కాలువ (13,000 ఎకరాల సామర్థ్యం), తాబేరు (3500 ఎకరాల సామర్థ్యం), ఊరక గెడ్డ (1500 ఎకరాలు), గొర్రి గెడ్డ (1500 ఎకరాలు) అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి స్థాయిలో తెస్తే సుమారు 20 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
- డిగ్రీ కాలేజీ మంజూరయ్యింది. స్థలం లేదు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ షిఫ్టులుగా పని చేస్తున్నాయి.
- మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేదు
- ఘాట్ రోడ్డు జంక్షన్ నుంచి మాడుగులకు బస్సులు రావడం లేదు
- బస్సు డిపో ఊరికి దూరంగా కట్టారు. అందువల్ల డిపో సేవలు అందడం లేదు
- ఎమ్మార్వో, సుబ్ ట్రెజరీ, ఎక్సైజ్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు