పాడేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగు, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 58,983 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 28,644, ఆడవారి సంఖ్య 30,339. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 45.97% ఇందులో పురుషులు 58.88% మంది మరియు స్త్రీలు 33.32%.
దర్శనీయ స్థలాలు, దేవాలయాలు
పాడేరుకు దగ్గరలో పర్యాటక ప్రాంతం అరకు ఉంది. ఇక్కడి దేవాలయాల్లో పాడేరు మోదకోండమ్మ అమ్మవారు దేవాలయం, పాదాలు అమ్మవారు దేవాలయం, జాంకరమ్మ తల్లి దేవాలయం, సాయిబాబా దేవాలయం, కనకదుర్గా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధానమైనవి.
ప్రసిద్ధ పండుగలలో ఒకటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మోదకొండమ్మ తాళ్లి జాతర పండుగను ఆంధ్రప్రదేశ్ యొక్క వారసత్వంగా ప్రకటించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి మరియు ఒడిషా రాష్ట్రాల నుండి భారతదేశమంతా చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ పండుగకు వస్తారు.
సమస్యలు
- బాక్సైట్ తవ్వితే సహించేది లేదని గిరిజనుల ఆందోళన
- మండల కేంద్రంలోనే తాగు నీటి సమస్య ఉంది
- ఆసుపత్రులలో సీనియర్ డాక్టర్లు, వైద్య నిపుణులు ఉండటం లేదు
- కెజిహెచ్ కు సిఫార్సు చేస్తున్నారు. అక్కడ నరకం చూస్తున్నారు
- ప్రాధమిక విద్య అధ్వానంగా ఉంది
- గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో మమైకమైపోయిన కొండ కుమ్మర్లకు ఎస్టీ జాబితాలో చేర్చాలి
- రైతులకు మేలు రకమైన విత్తనాలు అందడం లేదు
- గిరిజన ప్రాంత అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
- నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి
- 1/70 చట్టానికి తూట్లు, మన్యాన్ని విధ్వంసం చేస్తున్న గిరిజనేతరులు
- విద్యా వ్యవస్థ అస్తవ్యస్థం
- ప్రభుత్వ వైద్యులు, ఇతర అధికారులు విధిగా మూడేళ్లు ఏజెన్సీలో పని చేయాలి
- తాగు నీటి కోసం ట్యాంక్ లు కట్టారు, నీటిని మరిచారు
- మన్యంలో నక్సల్స్ కారణంగా రోడ్లు వేయలేకపోతున్నారు అని చెబుతున్నారు
- ఐటిడిఎ పాలకమండలి సమావేశాలు జరగడం లేదు
- ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్నట్లే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సదుపాయాలు కల్పించాలి
- హాస్టల్స్ లో వార్డెన్లను నియమించాలి
- కాలేజీలలో లెక్చరర్ పోస్టులను భర్తీ చెయ్యాలి
పాడేరు మండలంలోని గ్రామాలు
- ఉరవకొండ
- బంట్రోతుపుట్టు
- బర్లుపుట్టు
- దోనేల
- బొడ్డపుట్టు
- బరిడిపుట్టు
- బొంజంగి
- కించురు
- ఒంటివీధులు
- గొడ్డలిపాడు
- తోటలగొండి
- చీడిమెట్ట
- లంపెలి
- గొండెలి
- వంచడగొండి
- పిల్లిపుట్టు
- వల్లాపురం
- నేరేడువలస
- జల్లిపల్లి
- ముంచింగిపుట్టు
- కొత్తపల్లి
- వంటలగుమ్మి
- దబ్బపుట్టు
- కవిరై
- దుమ్మపుట్టు
- చింతగొండి
- రాయిగెడ్డ
- సాకిపుట్టు
- కొల్లంబొ
- లింగపుట్టు
- వల్లై
- బడిమెల
- ఇసకగరువు
- సంతగండువ
- కోటూరు
- సోలములు
- సిండుగుల
- చాకిరేవు
- సరియాపల్లి
- దొడ్డిపల్లి
- లడపుట్టు
- బొడ్డిమామిడి
- బొక్కెల్లు
- ఇరడపల్లి
- డొకులూరు
- మందిపుట్టు
- డేగలవీధి
- గాదివలస
- అంపూరు
- పామురెల్లి
- గుత్తులపుట్టు
- చీడిమెట్ట
- గబ్బంగి
- దాలింపుట్టు
- పనసపల్లి
- నేరేడువలస
- దేవరాపల్లి
- కొచ్చాబు
- బరిసింగి
- గుర్రంపణుకు
- పలమనిచిలక
- పోతురాజుమెట్ట
- కళ్ళాలబయలు
- బొడ్డపుట్టు
- దిగసంపలు
- వంజంగి
- గొండురు
- సుకురుపుట్టు
- పాతపాడేరు
- తలారిసింగి
- చింతలవీధి
- ఉబ్బేడిపుట్టు
- కుమ్మరిపుట్టు
- సుంద్రుపుట్టు
- కిండంగి
- పర్తనపల్లి
- కడెలి
- లగిశపల్లి
- గురుపల్లి
- కరకపుట్టు
- తోటగున్నలు
- కొత్తవలస
- ఇగసంపలు
- కరకపుట్టు
- జీడిపగడ
- బంగారుమెట్ట
- చీడికుడ్డ
- వణుగుపల్లి
- కొండమామిడి
- మినుములూరు
- సెరిబయలు
- తుంపాడ
- కుజ్జలి
- ఇస్కలి
- దిగుమొదపుట్టు
- ఎగుమొదపుట్టు
- కేండ్రంగిపాడు
- వంటాడపల్లి
- అల్లివర
- సంగోడి
- తామరపల్లి
- బండపొలం
- గలిపాడు
- కరిబండ
- తియ్యగెడ్డ
- బిరిమిసల
- చింతగున్నలు
- మాదిగబండ
- చీడుపాలెం
- మెట్టనోలు
- గుంజిగెడ్డ
- జోడూరు
- ఒంటిపాక
- చోడేపల్లి
- కొత్తపొలం
- గడ్డిబండలు
- ఒనురు
- వంజపర్తి
- ఇసకగరువు
- చింతాడ
- మలకపొలం
- మొదపల్లి
- గుర్రగరువు
- సల్దిగెడ్డ
- వనగరాయి
- రనంబాడి
- సప్పిపుట్టు
- దాల్లపల్లి
- వంకచింత
- బురుగు చెత్రు
- బురదపాడు
- లోలంగిపాడు
- పూలబండ
- కుమ్మరితూము
- నందిగరువు
- గులిమిద్దచత్రు
- పిడుగుపుట్టు
- ఎదులపాలెం
- కప్పరమజ్జి
- బద్దిగుమ్మి
- కప్పలగొండి
- కక్కి
- చిలకలగొండి
- వంటలమామిడి
- ఒబర్తి
- అర్జాపురం
- కందులపాలెం
- పిడుగుమామిడి
- గుల్లి
- రకోటా
- అర్లాడ
- పుటికగరువు
- కొదులోలంగిపాడు
- తూరుమామిడి
- బోడిచెట్టు
- జంగడపల్లి
- మాలపాడు
- రంగసింగిపాడు
- గూనగుమ్మి
- దిబరిగరువు
- బలమలు
- పెదపొలం
- గద్దిబండ
- గుల్లిపల్లి
- చీమలపల్లి
- తగవులమామిడి గరువు
- జోడిమామిడి
- పోతంపాలెం
- గదబవలస @ vai.కుసర్లపాలెం
- కొండజీలుగు
- రాయిపాలెం
- సీకాయిపాడు
- రెల్లబండ
- కుసర్లపాలెం
- అయినాడ
- గాచపణుకు
- దబ్బగరువు
- సలుగు
- పనసపుట్టు
- వంటలమామిడి @ గాదిలమెట్ట
- అలుగూరు
- తరగాం
- పులుసుమామిడి
- దేవపురం
- కొత్తవూరు
- తుమ్మలపాలెం
- ములగలపాలెం
- హనుమంతపురం
- వలసమామిడి
- కంగెద్ద
- కొత్త వలసపాడు
- అంటిలోవ
- సీకుపనస
- జీలుగుపాడు
- దబ్బపాడు
- జర్రగరువు
- పందిగుంట
- కుమ్మరిపాలెం