నక్కపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.
ఏనుగుల వీరాసామయ్య గారి కాశీ యాత్ర చరిత్రలో నక్కపల్లి ప్రస్తావన ఉంది. దాని పకారము 16 తేది వుదయాత్పూర్వము 4 వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగంటలకు లేచి యిక్కడిఒకి 5 కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్ళు 9 గంతలకు చేరినాను. దారి కొంత గడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. 50 యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది. వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి. యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతో చేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు. జిల్లాలో 100 కి 24 వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును. యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది. సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.
జనాభా (2011) - మొత్తం 81,079 - పురుషులు 40,352 - స్త్రీలు 40,727