ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నక్కపల్లి మండలం

నక్కపల్లి మండలం విశాఖపట్నం జిల్లాలో ఉంది. నక్కపల్లి మండలంలోని ఉపమాకా అనే ప్రాంతం హిందువులకు ఒక యాత్రా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధ ఆలయం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 81,079 మంది నివసిస్తూన్నారు. నకపల్లి మండల ప్రధానకార్యాలయం నక్కపల్లి నగరం. నక్కపల్లి జిల్లా ప్రధానకార్యాలయం విశాఖపట్నం నుండి పశ్చిమాన 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. నక్కపల్లి మండలం పశ్చిమానికి పాయకరావుపేట మండలం, తూర్పు వైపు ఎస్. రాయవరం మండలం, పశ్చిమాన తుని మండలం, ఉత్తర దిశగా కోటవురట్ల మండలం ఉన్నాయి.

నక్కపల్లిలో 65 గ్రామాలు మరియు 31 పంచాయితీలు ఉన్నాయి. నల్లమట్టిపాలెం చిన్న గ్రామం మరియు నక్కపల్లి అతిపెద్ద గ్రామం. నక్కపల్లి 18 మీ ఎత్తులో ఉంది. ఈ స్థలం విశాఖపట్టణం జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులో ఉంది. నక్కపల్లి, తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతానికి పశ్చిమాన ఉంది.

విశాఖపట్నం (వైజాగ్), కాకినాడ, సింహాచలం, రాజమండ్రి, అనంతగిరి సమీపంలోని పర్యాటక ఆకర్షణ ప్రాంతాలు. నక్కపల్లిలో మొత్తం జనాభా 81,079 మంది 17,504 గృహాలలో నివసిస్తున్నారు, మొత్తం 65 గ్రామాలు మరియు 31 పంచాయతీలలో విస్తరించింది. పురుషుల సంఖ్య 40,352 మరియు స్త్రీలు 40,727. నక్కపల్లి టౌన్ మొత్తం నిర్వహణలో 1,780 గృహాలు ఉన్నాయి, ఇందులో నీటి మరియు మురికినీటి వంటి ప్రాథమిక సదుపాయాలను అందిస్తుంది. నక్కపల్లి పట్టణం పరిమితుల లోపల రోడ్లు నిర్మించడానికి మరియు దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా ఇది అధికారం కల్పిస్తుంది.

విశేషాలు

ఏనుగుల వీరాసామయ్య గారి కాశీ యాత్ర చరిత్రలో నక్కపల్లి ప్రస్తావన ఉంది. దాని ప్రకారము 16 తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడిఒకి 5 కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్ళు 9 గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. 50 యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది. వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి. యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతో చేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు. జిల్లాలో 100 కి 24 వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును.

యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది.

సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.

ఈ పట్టణ సమస్యలు:

  • జిల్లాలో బాగా వెనుకబడిన మండలాల్లో ఇదొకటి
  • నక్కపల్లి, బుచ్చయ్యపేట మండలాలు విద్యలో వెనుకబడి ఉన్నాయి. కేవలం 33 శాతమే?
  • డిగ్రీ కాలేజీ మంజూరయ్యింది కానీ నిర్మించలేదు
  • భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో ఉప్పు నీరు వస్తోంది
  • తాగునీటి సమస్య తీవ్రతరం వుంది
  • మలబవానపాలెం(ఉపమాక) ప్రజలు హైవే దాటి నీరు తెచ్చుకుంటున్నారు
  • వరాహ నదిపై జలాశయం నిర్మించాలి
  • అత్యధిక దూరం హైవే ఉండటం వల్ల రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి
  • నక్కపల్లిలో వైద్యం అందడం లేదు. ఆర్థోపెడిక్, గైనికాలజిస్టు తదితర వైద్య నిపుణులు లేరు. 30 పడకలను 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి
  • మండలంలో రెండవ అతి పెద్ద గ్రామం చినదొడ్డిగల్లులో రూ. 25 లక్షలతో ఆసుపత్రి నిర్మించి మధ్యలో నిలిపేశారు
  • గాడిచర్లలో జూనియర్ కాలేజీ పెట్టాలి (కార్పస్ ఫండ్ ప్రజలు సమకూర్చేందుకు ముందుకు వచ్చారు)
  • రైతులను ఒప్పించి తాండవ నీరు మండలానికి తేవాలి
  • గాడిచర్ల ఆన వద్ద ట్యాంక్ కట్టాలి
  • నాలెడ్జ్ సెంటర్ నెలకొల్పాలి
  • ప్రాథమిక పాఠశాలలు ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలి
  • రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలి
  • పెండింగ్ లో ఉన్న చీడిక రిజర్వాయర్ ను అందుబాటులోకి తేవాలి (ఎస్టీ గ్రామం)
  • డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూప్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
  • పెట్రో కారిడార్ విశాఖ చెన్నై కారిడార్ పేరుతో మండలంలో మూడు వేల ఎకరాలు సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అఖిల పక్షం వ్యతిరేకించింది. కోర్టుకు వెళ్తే కొట్టేసింది. దీంతో భూ సేకరణ పనులు ఊపందుకున్నాయి. రైతులు వ్యతిరేకిస్తున్నారు. మండలాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి