ఎస్ రాయవరం (సర్వసిద్ధి రాయవరం) విశాఖపట్నం జిల్లా లో ఒక మండలం. ఇది గౌరవనీయులు శ్రీ గురుజాడ అప్పారావు గారు జన్మించిన స్థలం. తెలుగు భాషలో అయన గొప్ప కవి మరియు నాటక రచయిత. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 74,101 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 36,384, ఆడవారి సంఖ్య 37,717. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 51.28% ఇందులో పురుషులు 59.87% మంది మరియు స్త్రీలు 42.84%.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లాలోని. ఎస్ రాయవరం మండలం ప్రధాన కార్యాలయం. విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ఇది పశ్చిమ దిశగా 63 కి.మీ. దూరంలో ఉంది. ఉత్తర వైపు ఎలమంచిలి మండలం, తూర్పు వైపు రాంబిల్లి మండలం, పశ్చిమాన నక్కపల్లి మండలం, ఉత్తర వైపు కశింకోట మండలం ఎస్ రాయవరం మండలానికి సరిహద్దులలో ఉన్నాయి. ఎస్ రాయవరంలో 55 గ్రామాలు, 28 పంచాయితీలు ఉన్నాయి.
చిన ఉప్పల్లం అతి చిన్న గ్రామం మరియు ఎస్ రాయవరం అతిపెద్ద గ్రామం.