సబ్బవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 67,334 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 34,072, ఆడవారి సంఖ్య 33,262. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 55.46% ఇందులో పురుషులు 68.91% మంది మరియు స్త్రీలు 41.49%.
నీటిపారుదల సౌకర్యాలు
సబ్బవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బావులు/బోరు బావులు: 132 హెక్టార్లు* చెరువులు: 202 హెక్టార్లు
ఈ పట్టణ సమస్యలు:
- అయ్యన్నపాలెం భూదేవి చెరువుపై రిజర్వాయిర్ నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసారు. (సుజల స్రవంతి కోసం) ఆరు గ్రామాలలో 300 ఎకరాలకు నీరు అందుతుంది. ప్రస్తుతం ఎస్టీపీపీ నిధులతో పనులు జరుగుతున్నాయి.
- విజయరామసాగర్: మల్లరేగులపాలెంలో రూ. 2.5 కోట్ల అంచనాతో జలాశయం నిర్మించ తలపెట్టారు. నల్లరేగటిపాలెం, బలజపాలెం, మారపాలు ఈ మూడు గ్రామాలకు చెందిన 120 ఎకరాలకు నీరు అందుతుంది. పది ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. తాగునీటి సమస్య అధికం. రెండు పూట్ల నీరు ఇవ్వాలి (మేహాద్రిగెడ్డ నీరు వస్తుంది) అనకాపల్లి ఆనందపురం రహదారి ఎన్ హెచ్ 5 ఆరు లైన్ల రోడ్డు గా విస్తరించాలి. రహదారి విస్తరణ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- రైవాడ కాలువ వస్తే మూడు మండలాలకు నీరు అందుతుంది.
- బి.యస్. రోడ్డు (భీమిలి నర్సీపట్నం రోడ్డు) నాలుగు లైన్లు చెయ్యాలి.
- భూదాన బోర్డుకు చెందిన 600 ఎకరాలు భూములు అన్యాక్రాంతమయ్యాయి
- దేవీపురం, దొంగలమర్రి, సీతారామపురం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా వృద్ధి చెయ్యాలి 30 పడకల ఆసుపత్రిని డీ గ్రేడ్ చెయ్యడం దారుణం. తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావాలి.
- భూ కబ్జాలు అధికం
- 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 600 మంది నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి.
- ఎడ్యుకేషన్ హబ్: ఏపీ లా యూనివర్సిటీ (పనులు జరుగుతున్నాయి). మారిటైమ్ యూనివర్సిటీ (శంకుస్తాపన అయ్యింది). పెట్రోలియం యూనివర్సిటీ (మంజూరయ్యింది). టెక్నికల్ యూనివర్సిటీ త్వరితగతిన పూర్తి చెయ్యాలి.