ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

విశాఖపట్నం చారిత్రక నేపథ్యం

విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని జిల్లా మరియుఒక మండలము. ఆంధ్ర ప్రదేశ్లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం. బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రలాలో ఒకటి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేయబడింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్ నోస్" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్వాటర్స్గా పనిచేస్తుంది.

చరిత్ర

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు.

స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు.

ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది.

18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు. 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది

భౌగోళికం

విశాఖపట్నం బంగాళా ఖాతము నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన ఒడిషా రాష్ట్రము మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా గలదు. తూర్పున బంగాళాఖాతము, మరియు పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, మరియు 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం మరియు తీరప్రాంతాలతో ఉంది. దీని వైశాల్యం 11,161 kమీ2 (4,309 sq mi).

నగరం పేరు వెనుక చరిత్ర

విశాఖ పట్నం అన్న గ్రామనామం విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి. సముద్రతీరప్రాంతం కావడంతో ఈ నగరం పేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం ప్రధానంగా స్వీకరించవచ్చు.

మహా విశాఖ నగర పాలన

జాతీయ పట్టణ అభివృద్ధి పధకం ద్వారా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విశాఖ పట్నం పురపాలక సంఘాన్ని, మహా విశాఖ పట్నం పురపాలక సంఘంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, విశాఖపట్నం చుట్టుపక్కల వున్న 32 గ్రామాలను (గ్రామాల పేర్లు కింద చూడు), గాజువాక పురపాలక సంఘాన్ని, మహా విశాఖ పురపాలక సంఘం ప్రభుత్వ ఆర్డరు G.O. Ms.No.938 MA & UD (Elec.II) Dept.తేది 2005 నవంబరు 21 ఇచ్చిన అధికారంతో విలీనం చేసారు. 9.82 లక్షల జనాభా వున్న విశాఖ, ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసి పోయిన తరువాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది. ఈ విలీనం వల్ల 111 చదరపు కిలోమీటర్లు (చ.కీ.మీ.) పరిధిలో విస్తరించిన విశాఖ, 534 చ.కీ.మీ. విస్తీర్ణానికి పెరుగుతుంది.

మహా విశాఖ నగర పాలక సంస్థను 11 విబాగాలుగా విడదీసి, పరిపాలన చేస్తున్నారు. ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి అయిన కమిషనరు (ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు.

జనాభా:

జనాభా పెరుగుదల కారణంగా 1981లో 180 మురికి వాడలున్న విశాఖపట్నంలో, 2011 సంవత్సరానికి 650 పైగా మురికి వాడలు ఉన్నాయి. వీరికి ఉండటానికి చోటు లేక, సిండియా నుంచి గాజువాక వరకూ వున్న పారిశ్రామిక ప్రాంతంలోని కొండల మీద నివాసం ఉంటున్నారు. అలాగే కప్పరాడ, మధురవాడ ప్రాంతాలలోని కొండల మీద నివాసాలు పెరిగాయి. వీరంతా వలస వచ్చిన వారే. ఫలితంగా వర్యావరణ సమస్యలు, కొండల మీద పచ్చదనం అంతరించి పోవటం జరుగు తుంది. జనాభా 2001 నుంచి 2011 వరకు (గత పదేళ్ళలో) నాలుగు లక్షల వరకు పెరిగి ఉంటుందని జనాభా అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 ఫిబ్రవరి 9 నుంచి 2011 ఫిబ్రవరి 28 వరకు రెండో విడత జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2001 లో నగర జనాభా 13.5 లక్షలు.ఇంతవరకూ, సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా, 17.5 లక్షలవరకు నగర జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా. పూర్తిగా జనాభా లెక్కలు సేకరించిన తరువాత ఈ లెక్కలు మరింత పెరగ వచ్చును. గ్రామీణ ప్రాంతంలో పెరుగుదల 11 శాతం అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండ వచ్చును. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 24.50 లక్షల మంది ఉండగా, ఆ అంకె 27.50 లక్షలకు చేరవచ్చని అంచనా. విశాఖ నగరంతో కలిపి విశాఖపట్నం జిల్లా జనాభా 2001లో 38 లక్షలు. అదే 2011 నాటికి ఈ అంకెలు 45 లక్షలకు చేరవచ్ఛని అంచనా.

పరిశ్రమలు:

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో హిందుస్దాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చమురు శుద్ధి కర్మాగారం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, జింకు శుద్ధి కేంద్రం, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్ లిమిటెడ్, హిందూస్థాన్ షిప్యార్డు, కోరమండల్ ఫెర్టిలైజర్సు, గంగవరం పోర్ట్, ఇది ఫ్రైవేటు పోర్టు కొన్ని. ఉక్కునగరంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 6.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ముడిసరుకు కొరత తలెత్తకుండాఅ ఉండేందుకు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఐరన్ ఓర్ యార్డు నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది రవాణా జాప్యమైతే కర్మాగారం ఇబ్బందుల్లో పడకుండా నిల్వ ఉంచిన ముడిసరుకును వినియోగించుకోవచ్చును. భవిష్యత్తులో గనుల నుంచి నేరుగా కర్మాగారానికి పైపుల ద్వారా ముడిసరుకు సరఫరా చేసేలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

పరిశ్రమల అభివృద్ధి కొరకు విశాఖపట్నంలో ఒక ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంను ప్రభుత్వం నెలకొల్పింది. విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

ఐ.టీ రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. సత్యం కంప్యూటర్స్, హెచ్.ఎస్.బి.సి, సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్, నూనెట్ టెక్నాలజీస్ ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు. ఐ.బీ.ఎమ్ వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు వైజాగ్ సమీపంలోని పరవాడ లో ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందాయి .

భారత నౌకాదళం

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం).

పర్యాటకం:

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, డాల్ఫిన్స్ నోస్ (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు, ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్ను చూడవచ్ఛు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ దిగితే, యారాడ అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో పచ్ఛని పొలాలతో ఈ పల్లె కనిపిస్తుంది. కనకాంబరాలు కూడా ఇక్కడ పండిస్తారు. రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కాల్వరి) మ్యూజియం ఉన్నాయి. భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు. కాళికా దేవి ఆలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్),కైలాసగిరి - శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి., రిషికొండ బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ, పున్నమి రిసార్టులను వర్యాటకులకు అద్దెకు ఇస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చోటు. జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు కట్టక ముందు, ఈ ప్రాంతాన్ని, ఎల్లమ్మ తోటగా పిలిచే వారు. నాగుల చవితి నాడు, ఇక్కడి చుట్టుపక్కల వున్న ప్రజలు పుట్టలో పాలు పోసేవారు. అన్ని పాము పుట్టలు వుండేవి. చిన్న అడవి లాగా వుండేది. ఇప్పటికీ, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడి భూములన్నీ 'దసపల్లా' రాజులకు చెందినవి. అందుకు గుర్తుగా ఇక్కడ కట్టిన సినిమా హాలు పేరు 'దసపల్లా ఛిత్రాలయ'. హోటల్ వేరు 'దసపల్లా హోటల్'. జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం అంతా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది, విశాఖపట్నం అంటే, జగదాంబ సెంటరు ఆందరికీ గుర్తు వస్తుంది. అర్.టి.సి. కాంప్లెక్స్ కట్టేవరకు, విశాఖపట్నం జగదాంబ సెంటర్ వరకే వుండేది. అరకు: వేసవి విడిది. ఇక్కడికి 112 కి.మీ దూరం. అరకు లోయ 3100 అడుగుల ఎత్తులో ఉంది. విశాఖ నుంచి అరకు లోయకు రైలు ప్రయాణం ఒక మధురానుభూతి. పచ్ఛని లోయలు, హోటళ్ళు, విశ్రాంతి మందిరాలు వునాయి. పద్మాపురం గార్డెన్స్, బొర్రా గుహలు కూడా చూడదగినవి. బొర్రా గుహలు (90 కి.మీ దూరం) 10లక్షల సంవత్స్రరాల క్రితం ఏర్పడినవి. పర్యాటక శాఖ ఈ గుహలను విద్యుత్ దీపాలతో అలంకరించింది.

పోర్టు వెంకటేశ్వర స్వామి: ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి.ఒక కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండపై ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన ఛర్చి ఉన్నాయి. విశాఖపట్నంలోని ఈమూడు మతాల పవిత్ర ప్రదేశాలు చూడటం ఒక మధురానుభూతి.
కాళికాలయం: మూడు కాళికాలయాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ బీచ్ దగ్గర, రెండవది ఉక్కు నగరంలో, మూడవది రైల్వే స్టేషను దగ్గర.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి