ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చీపురుపల్లిని ఆర్ధికంగా బలోపేతం చేయగల వనరులున్నాయి, కానీ కార్యాచరణ ఉందా?

విజయనగరం జిల్లాలో ఉన్న చీపురుపల్లి ఒక జనాభా గణన పట్టణం. ఈ పట్టణం జిల్లాకేంద్రమైన విజయనగరానికి ఉత్తర దిశలో, 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 348 హెక్టార్ల విస్తీర్ణంతో ఈ పట్టణం చెన్నై-హౌరా రైల్వే లైన్ పరిధిలో ఉన్నందున ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, చిన్న మునిసిపాలిటీలు లేదా పట్టణాలకు పరిపాలన , విద్య, వ్యాపార, వాణిజ్య, వినోద కేంద్రాంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 78,000 మంది జనాభా గల ఈ పట్టణం 38,500 పురుషులు మరియు 39,500 మంది మహిళలతో సమానమైన లింగ నిష్పత్తి కలిగి ఉంది. 74.41%, అక్షరాస్యతతో ఈ పట్టణం విద్యారంగంలో కొంత ప్రగతి సాధించినా ఇంకా విద్యాపరమైన మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. చీపురుపల్లిని రెవిన్యూ డివిజన్ గా పరిగణించాలన్న చిరకాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చ్ నాటికి సుత్రాప్రాయంగా అంగీకరించింది. దీనివలన రెవిన్యూ పరమైన కార్యకలాపాలలో కొంత వెసులుబాటు దొరికినప్పటికీ, మిగతా రంగాలలో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక మహిళా డిగ్రీ కళాశాలకై ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఉన్న మహిళా కళాశాలకు మరొక్కటి తోడైతే, ఈ మండలం మహిళాఅక్షరాస్యతను ఇతోధికంగా పెంచగలదు. దీనితో బాటు, వైద్య, వెటర్నరీ మరియు ఇతర వృత్తి విద్యా కళాశాలల అవసరం ఏంతో ఉంది. వెటర్నరీ కళాశాల స్థాపనకై స్థలం కేటాయించి ఏళ్ళు గడిచినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

వ్యవసాయాధారిత, సముద్ర తీర ప్రాంతమైన ఈ జిల్లా గుండా నాగావళి , సువర్ణముఖి గోస్తనీ, చంపావతి, వేగావతి నదులు ప్రవహిస్తున్నా చీపురుపల్లి సాగు, తాగు నీటికి కట కటలాడుతున్నది . ఈ జీవనదుల అనుసంధానంతో ఈ ప్రాంత ప్రజల సాగు, తాగు నీటి సమస్యను అధిగమించవచ్చు. పారిశ్రామికాభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన ఈ జిల్లా తలసరి సగటు ఆదాయం 18,382 కోట్ల రూపాయలు మాత్రమే. జిల్లాలో లాటరైటర్, క్వార్ట్జ్, గ్రానైట్ వంటి ఖనిజాలున్నందున వాటిని వెలికితీసి, సంబంధిత పరిశ్రమలు స్థాపించాలి. యువతలో నైపుణ్యాభివృద్ధి ద్వారా సంక్షేమ, సర్వీస్ రంగాలలో ఉఫాధి కల్పించడంతో బాటు స్వయం ఉఫాధి కల్పనపై కూడా దృష్టి సారించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో ఉద్యోగార్థుల నిమిత్తం ఇక్కడ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణా కేంద్రం స్థాపించాలనే వినతి చిరకాలంగా ఉంది. ఈ చర్యలు చీపురుపల్లిని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.

చీపురుపల్లి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి