విజయనగరం జిల్లాలో గజపతినగరం మండల కేంద్రంగానూ, రెవిన్యూ డివిజన్ గాను, జనాభాగణన పట్టణంగాను, మరియు అసెంబ్లీకి నియోజకవర్గంగాను వ్యవహరిస్తున్నది. . 2011 భారతదేశ జనాభా గణన నివేదిక ప్రకారం, గజపతినగర పట్టణ జనాభా 5,687 గా ఉంది, ఇందులో 2,847 మంది పురుషులు, 2,840 మంది మహిళలు. స్త్రీ, పురుష లింగ నిష్పత్తి లో 1000:998, సగటుతో, రాష్ట్ర సగటు 993 కన్నా ఎక్కువగా ఉంది. 67.02% అక్షరాస్యతతో, గజపతినగరం పట్టణం అక్షరాస్యతలో చాలా వెనుకబడిఉంది. ఇక్కడి పురుషులలో అక్షరాస్యత రేటు 80.96% ఉండగా, మహిళల అక్షరాస్యత రేటు 65.90%. మాత్రమే.
గజపతినగరం పట్టణంలో తాగు నీరు భూగర్భ డ్రైనేజ్ ప్రధాన సమన్య, రహదారులు, ప్రాధమిక, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రి వంటి ప్రాధమిక మౌలిక వసతులు జనావాసరాలకు తగినంతగా లేదు. ఫలితంగా, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్ధిక వెనుకబాటుకు కారణాలవుతున్నది. 2017 వ సంవత్సరం లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో గజపతినగరం ప్రాంతంలో మెగా ఫుడ్ ఆపార్క్, ఫెర్రో ఆల్లొస్ జీడీ, చేపలు ఇంకా గోధుమల ప్రాసెసింగ్ యూనిట్లతోబాటు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ పరిశ్రమలపై కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. ఇప్పటికే ఈ మండలంలో ఎలక్ట్రికల్ , ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెస్సింగ్ యూనిట్లు, జీడీ ప్రాసెసింగ్ పరిశ్రమ, ఎనర్జీ, బయో ఫ్యూయెల్, ఆహార సంబంధిత ఉత్పత్తుల యూనిట్లు స్థానికులకు కొంతవరకు ఉఫాధి అవకాశాలు కల్పించినా, మండల జనాభా , నిరుద్యోగుల సంఖ్యా పరంగా ఉఫాధి అవకాశాల విస్తరణ అవసరం. మౌలిక వసతులు కల్పించి, ఉఫాధి అవకాశాలు విస్తరిస్తే, గజపతినగరం చరిత్రలో ఒకప్పటి పూర్వవైభవాన్ని తిరిగి పొందగలదు