ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పార్వతీపురం అభివృద్ధి పై నిర్లక్ష్యపు నీలినీడలు తొలగేదెప్పుడు?

పార్వతీపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. 2007 సంవత్సరం వరకు పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉన్న పార్వతీపురాన్ని అరకు మరియు విజయనగరం నియోజక వర్గాలలో విలీనం చేశారు. ప్రస్తుతం పార్వతీపురం షెడ్యూల్డ్ తేగలకై కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గంగానూ, మండల కేంద్రంగా కుడా వ్యవహరిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం పార్వతీపురం పట్టణ జనాభా 53,844 మందిలో మగవారి సంఖ్య 26,811, మహిళల సంఖ్య 27,033. పట్టణంలో అక్షరాస్యతా శాతం 79.14%.

పార్వతీపురం అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలలో అనేక పర్యాయాలు మార్పులు చేర్పులు చేయటంవలన నిర్లక్ష్యానికి గురైంది. పూర్తిగా ఉద్యాన పంటలు, వ్యవసాయం పైన ఆధార పది జీవిస్తున్న ఇక్కడి ప్రజల్లో సాగు, తాగునీటి కొరత చాలా ఎక్కువ. గిరిజన జనాభా అదికంగా ఉండటం, వర్షాదారం మీద అదారపడే అయకట్టు ప్రాంతం కావడంతో అభివృద్ధిలో వెనుకబడి ఉంది.

మండలంలో లక్షకుపైగా ఉన్న జనాభా విద్య, వైద్య అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు అవసరం. మహిళా డిగ్రీ కళాశాల స్థాపన , వృత్తివిద్యను ప్రోత్సహించే ఇంజినీరింగ్ కళాశాలలు అవసరం. అంతేకాకుండా, మండలంలో రైల్వే క్రాస్ లైనల వద్ద రైల్వే బ్రిడ్జ్ లను నిర్మిస్తే, అడుగడుక్కీ అడ్డుతగిలే రైల్వే గేట్లనుండి, ప్రమాదాలనుండి ప్రజలను కాపాడవచ్చు. ఇక ఈ ప్రాంతపు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచగల ఒట్టి ముడగవలసల జలాశయం మొదలుపెట్టి 15 ఏళ్ళు గడుస్తున్నా, నిర్మాణవ్యయం పెరగడం తప్ప పూర్తయ్యే దాఖలాలు లేవు.

ఆర్ధికంగా వెనుకబడిన ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, ఇంకా ఇతర ఉఫాధి అవకాశాల కల్పన అవసరం కాలునుగుణంగా సంక్రమించే వ్యాధులు మరియు వైద్య సదుపాయాల లేమి ఇంకొ జటిలమైన సమస్య.

పార్వతీపురం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి