మెంటాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము
మండల కేంద్రంలో ఉన్న మెంటాడ శాఖ గ్రంథాలయం నిరుద్యోగులకు, పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తుంది. గ్రంథాలయంలో లభ్యమవుతున్న పుస్తకాలవల్ల పలువురు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ వృద్ధులకు సంపూర్ణ రామాయణం, భారతం, పెదబాలశిక్ష తదితర ఎన్నో విలువైన గ్రంథాలు ఉన్నాయి. వీటిని ఇంటికి తీసుకువెళ్లి వృద్ధులు చదువుతూ ఉన్నారు. ఈ శాఖా గ్రంథాలయానికి మెంటాడ, ఆగురు, తమ్మరాజుపేట, గుర్ల , పిట్టాడ తదితర గ్రామాల నుండి రోజుకు 150-200 మంది పాఠకులు వస్తున్నారు. ఈ గ్రందాలయాన్ని వావిలాల గోపాల కృష్ణయ్య ప్రారంభించారు.ప్రస్తుతం అద్దె ఇండ్లలోగ్రంథాలయాలు నడుస్తున్నాయి. నిరుద్యోగ యువతకోసం ఎప్పడికప్పుడు పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నారు. రోజురోజుకు గ్రంధాలయాలనకు పాఠకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయం అద్దె ఇంట్లో నిర్వహించడం వలన వసతి సమస్య తీవ్రంగా ఉంటుందని విద్యార్థులు, నిరుద్యోగులు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసి కృష్ణం రాజు అనే వ్యక్తి గ్రంథాలయం ఏర్పాటుకు సరిపడ జిరాయితీ భూమిని సుమారు ఐదు సెంట్లును విరాళంగా ఇచ్చారు. స్థల సమస్య తీరడంతో భవనానికి చైర్మన్ రొంగలి పోతన్న ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. భవన నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. భవనం పూర్తి అయితే నిరుద్యోగులకు విద్యార్థులకు సమస్యలు తీరినట్లేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు భాష స్థానిక భాష. మెంటడ పట్టణం మొత్తం జనాభా 4977 మరియు ఇళ్ళు సంఖ్య 1181. స్త్రీ జనాభా 50.0%. పట్టణ అక్షరాస్యత రేటు 52.4% మరియు స్త్రీ అక్షరాస్యత రేటు 21.2%.