సాలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
సాలూరు వంశధార ఉపనదైన వేగావతి ఒడ్డున ఉంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం. ఈ ఊరిలో పురాతనమైన పంచముఖేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రహ్మేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడకు దగ్గరలోనే శంబరపోలమాంబ,పారమ్మకొండలాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్, పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి.... ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి .. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం. ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే . ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ పట్రయుని సీతారామశాస్త్రి గారి దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు
సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరంలో రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు. సాలూరు పట్టణంలో పువ్వుల పెంపకం, లారీల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలో జరిగిన ఉన్నత మార్పుల వల్ల, 2002 సంవత్సరం నుండి పట్టణంలో 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతులో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగర జిల్లాలోని సాలూర్ మండల్ మొత్తం జనాభా 105,389 గా ఉంది. అందులో 51,107 మంది పురుషులు, 54,282 మంది స్త్రీలు ఉన్నారు. 2011 లో సాలూర్ మండల్లో నివసిస్తున్న మొత్తం 26,203 కుటుంబాలు ఉన్నాయి. సాలూర్ మండల్ యొక్క సగటు సెక్స్ నిష్పత్తి 1,062.
మొత్తం జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం, 47% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు, 53% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 73.2%, గ్రామీణ ప్రాంతాలలో 43.7%. సాలూర్ మండల్లో పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 1,061, గ్రామీణ ప్రాంతాల్లో 1,063.