ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కొత్తవలస మండలం

కొత్తవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.

పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు విశాఖపట్నంలో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో తూర్పు కనుమలు కనపడతూ ఉంటాయి. కొత్తవలస ఎర్రమట్టికి ప్రసిద్ధి ఇక్కడ మామిడి, జీడి తోటలు ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్ కతాకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న ఒడిషా రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో 8వ అధిక జనాభా కలిగిన ఉప జిల్లాగా ఉంది. ఉప జిల్లాలో 26 గ్రామాలు ఉన్నాయి, వాటిలో చింతలపాలం 6522 జనాభా కలిగిన అత్యంత జనసాంద్రత కలిగిన గ్రామంగా ఉంది మరియు నరపం 257 జనాభా కలిగిన అతి చిన్న గ్రామం.

సమస్యలు:

  • ఉత్తరాపల్లి
  • డిగ్రీ కాలేజీ ఐటిఐ కావాలి.
  • పీహెచ్సీలలో డాక్టర్లు లేరు.
  • మూడు జూట్ మిల్లు, 25 టైల్స్ కంపెనీ మూత పడ్డాయి. ఐదు వేల మంది కార్మికులు వీధిన పడ్డారు.
  • కూలీలు రోజు విశాఖ వెళ్లి పనులు చేసుకుని వస్తున్నారు.
  • వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ స్థలాలుగా మారిపోయాయి.
  • విద్యుత్ కోత కారణంగా ఫెర్రో ఎలాసిస్ మూతపడటంతో మరో మూడు వేల మంది రోడ్డున పడ్డారు.
  • కొత్తవలస సబ్బవరంకి వంతెన ఎంతో అవసరం.100 గ్రామాలకు దీని వల్ల ఉపయోగం
  • రైల్వే అండర్ గ్రౌండ్ సబ్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి. చాలా కాలంగా ఇది పెండింగ్.
  • రోజు చాలాసార్లు రైల్వే గేటు పడుతుంటాయి. పడిన ప్రతిసారి 5 నుంచి 15 నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి.
  • తాగునీటి సమస్య ఉంది.
  • రహదారులు సరిగా లేవు.
శ్రుంగవరపుకోట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి